భారత్‌లో ప్రైవేట్ ల్యాబ్‌లోనూ కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను సవరిస్తూ సోమవారం మరోసారి ఉత్తర్వులిచ్చింది. కోవిడ్-19 పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లు ఫీజు వసూలు చేయవచ్చని.. అయితే వాటిని చెల్లించే స్థోమత ఉన్నవారి నుంచే వసూలు చేయాలని దానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. పేదవారికి మాత్రం ఉచితంగా చేయాలని ఆదేశించింది. ఎవరెవరికి ఉచితంగా నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించాలని సూచించింది.