టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయితే ఆమె పేరు చెప్పుకొని కొందరు కేటుగాళ్లు ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 1.70 కోట్లు కొట్టేశారు. ఇప్పటికే సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ చైతన్య అనే వ్యక్తి మోసానికి పాల్పడగా అతని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చైతన్య చేతిలో మోససోయిన ఓ మహిళ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 1.70 కోట్ల మోసం బయటపడింది.
కొత్తపేటకు చెందిన ఓ మహిళ సునీతకు అభిమాని. దీన్ని ఆసరాగా చేసుకున్న చైతన్య అనే వ్యక్తి సునీత్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఇదేనని ఓ నంబర్ ఇచ్చాడు. అలా ఆమెను నమ్మించాడు. ఇలా కొద్ది రోజులు గడిశాక.. ఒకరోజు కేరళలోని ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో .. బాధితురాలు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడేవారు కాదు. దీంతో అనుమానం వచ్చి బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.