మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ ‘RRR’. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీంగానూ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగానూ నటించి సంచలనం సృష్టించారు. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది.
పలు అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్టాత్మక అవార్డుల్నిదక్కించుకుంటోంది. హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ విదేశీ ప్రేక్షకుల్ని సైతం రికార్డు స్థాయిలో మెప్పించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రెండు విభాగాల్లో నామినేట్ అయిన ఈ మూవీ రీసెంట్ గా ఆస్కార్ అకాడమీ అవార్డులకు ప్రత్యేక కేటగిరీలో షార్ట్ లిస్ట్ చేయబడి నామినేట్ కావడం తెలిసిందే.
దీంతో యావత్ ఇండియా మొత్తం త్వరలో జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ‘RRR’ ‘నాటు నాటు’ పాటకు గానూ ఆస్కార్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై హాలీవుడ్ నటి ‘టైటానిక్’ ఫేమ్ ఫ్రాన్సెస్ ఫిషర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జేమ్స్ కామెరూన్ ‘టైటానిక్’ మూవీలో హీరోయిన్ కేట్ విన్స్లేట్ కు ఫ్రాన్సెస్ ఫిషర్ తల్లిగా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Your physical aptitude to do your stunts AND to dance & sing, and to act in your scenes was remarkable!
I bet y’all had a blast!— Frances Fisher (@Frances_Fisher) January 3, 2023