HomeTelugu Big StoriesBigg Boss 8 Telugu ఇంటి లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్లలో నలుగురు సీనియర్ వీళ్ళేనా?

Bigg Boss 8 Telugu ఇంటి లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్లలో నలుగురు సీనియర్ వీళ్ళేనా?

Four seniors to enter Bigg Boss 8 Telugu this week?
Four seniors to enter Bigg Boss 8 Telugu this week?

Bigg Boss 8 Telugu Wild Card Entry:

బిగ్ బాస్ తెలుగు 8 మొదలై మొదటి నెల పూర్తి కాబోతోంది. ఇంటి లోపల డ్రామా పెరుగుతూ వస్తోంది. ముగ్గురు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోగా ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. రాబోయే వారాల్లో భారీ ట్విస్టులు ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఇటీవల విడుదలైన ప్రమోలో, మేకర్స్ ఒక సంచలన ట్విస్ట్‌ను రివీల్ చేశారు.

నిజానికి, 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఇంటికి రావాలి. అయితే, ప్రస్తుత కంటెస్టెంట్లకు ఈ కొత్త కంటెస్టెంట్లను ఆపే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దానికోసం కొన్ని చాలెంజ్ లు కూడా ఇచ్చారు. ఒక చాలెంజ్ వారు ఓడిపోతే, ఒక కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఇంటిలోకి వస్తారు. ఈ ట్విస్ట్ ఇంట్లో ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఎందుకంటే కంటెస్టెంట్లు తాము గెలవడం మాత్రమే కాదు, కొత్త వారిని అడ్డుకోవడం కోసం కూడా పోరాడాలి.

ట్విస్ట్ ఏంటి అంటే.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు కొత్తవాళ్ళు కాదు. పాత బిగ్ బాస్ సీజన్లలో కనిపించిన సీనియర్ కంటెస్టెంట్లు తిరిగి రాబోతున్నారు. ఇప్పటికే 4 మంది సీనియర్ కంటెస్టెంట్లు రావడానికి కన్ఫర్మ్ అయ్యారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..

1. యాంకర్ రవి (సీజన్ 5)

New Project 2024 09 27T183141 Bigg Boss 8 Telugu,Bigg Boss 8 Telugu wild card

2. నయని పావని (సీజన్ 7)

New Project 2024 09 27T183416 Bigg Boss 8 Telugu,Bigg Boss 8 Telugu wild card

3. హరితేజ (సీజన్ 1)

New Project 2024 09 27T183553 Bigg Boss 8 Telugu,Bigg Boss 8 Telugu wild card

4. గౌతమ్ కృష్ణ (సీజన్ 7)

New Project 2024 09 27T183808 Bigg Boss 8 Telugu,Bigg Boss 8 Telugu wild card

ఈ సీనియర్స్ సాధారణ కంటెస్టెంట్లుగా పోటీ చేస్తారా లేక ప్రత్యేక పాత్రలలో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండడంతో.. బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు

Read More: Bigg Boss 8 Telugu లో ఈ వారం ఎవరూ ఊహించని ట్విస్ట్

Recent Articles English

Gallery

Recent Articles Telugu