Flop director’s high budget project:
సినీ పరిశ్రమలో టాలెంట్ ఒక్కటే కాక, అదృష్టం కూడా తోడవ్వాలి అని అంటారు. దర్శకుడు రమేష్ వర్మ కెరీర్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. “ఒక ఊరిలో,” “రైడ్,” “వీరా,” “రాక్షసుడు,” “ఖిలాడి” వంటి చిత్రాలను తెరకెక్కించిన రమేష్ వర్మకు పెద్ద హిట్ అందలేదు. వీటిలో “రైడ్”, “రాక్షసుడు” మాత్రమే సగటు విజయాలను సాధించాయి.
సామాన్యంగా ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుల్ని హీరోలు, నిర్మాతలు దూరం పెడతారు. కానీ, రమేష్ వర్మకు ఎప్పటికప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇది ఆయనకు నిర్మాత కోన వెంకట్ వంటి వారి మద్దతు ఉండడం వల్లనే సాధ్యమైంది. ప్రస్తుతం రమేష్ వర్మ రాఘవ లారెన్స్ హీరోగా “కాలభైరవ” అనే చిత్రాన్ని దాదాపు ₹80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
Raghava Lawrence – #KaalaBhairava – First Look pic.twitter.com/i96sUxhptu
— Aakashavaani (@TheAakashavaani) October 29, 2024
అంతేకాకుండా, బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్‌కి ఒక కథ వినిపించి, పచ్చ జెండా తెచ్చుకున్నారు. “సూపర్ హీరో” అనే టెంటటివ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం దాదాపు ₹200 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. 2025 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తెలుగు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి వారితో పోలిస్తే రమేష్ వర్మ ట్రాక్ రికార్డ్ బలహీనంగా ఉన్నా, బాలీవుడ్‌లో ఆయనకు ఇలాంటి అవకాశాలు రావడం విశేషమే. ఈసారి అయినా ఆయన తన అదృష్టాన్ని నిలబెట్టుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Allu Arjun సంధ్య థియేటర్ కేస్ లో నిందితుల జాబితా ఇదే!