రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి 2’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా అని అందరూ గర్వంగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో 5 తప్పులు ఉన్నాయని ఓ యువ దర్శకుడు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అతడు మరెవరో కాదు విఘ్నేష్ శివన్ మరి ఆ తప్పులేంటో చూద్దాం!
1. కేవలం 120 రూపాయలకే సినిమా చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం, నిర్మాత కోసం థియేటర్ల ముందు కలెక్షన్ బాక్స్‌లు పెట్టాలి.
2. సినిమా నిడివి చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
3. అత్యంత డీటెయిల్డ్‌గా సినిమాను చిత్రీకరించటం, దీని వల్ల ఇన్నాళ్లు తాము పర్ఫెక్ట్‌గా సినిమా చేస్తున్నామనుకునే చాలా మంది దర్శకుల తల పొగరు తగ్గుతుంది.
4. ఇది కన్‌క్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ సిరీస్‌లో మరో పది సినిమాలు త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాం.
5. భవిష్యత్తు ఎంతో కష్టంగా ఉండనుంది. ఎందుకంటే ఈ స్థాయి రికార్డ్‌లను బద్ధలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లు పడుతుంది.
ఇవే ఈ సినిమా తప్పులంటూ విఘ్నేష్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకనిర్మాతలకు, నటీనటులకు శుభాకాంక్షలు తెలిపారు.