అక్కినేని యువ నటుడు అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అంతే కాకుండా తొలి అడుగు అంటూ రిలీజ్ చేసిన అఖిల్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. సెకండ్ స్టెప్ అంటూ.. హీరోయిన్ పూజా హెగ్డే లుక్‌ని విడుదల చేశారు.
దానితో ఈ సినిమా పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ లో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.. ఈ చిత్రంలో ఆమని,మురళి శర్మ, జయ ప్రకాశ్ తదితరులు నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.