బాలీవుడ్ నటుడు, జేమ్స్‌బాండ్ తొలి పాత్రధారి సర్ థామస్ సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన ఆయన ఆస్కార్ పురస్కారం సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈఏడాది ఆగస్టులో సీన్ కానరీ 90వ పుట్టిన రోజు జరుపుకొన్న ఆయన మూడు నెలలు తిరగకుండానే కన్నుమూయడంతో హాలీవుడ్ నటులు, ఆయన అభిమానులు విచారంలో మునిగిపోయారు. మొత్తం ఆరు చిత్రాల్లో ఆయన జేమ్స్ బాండ్‌గా దర్శనమిచ్చారు. డాక్టర్ నో’, ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘థండర్ బాల్’, ‘యు ఓన్లీ లివ్ ట్వైస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘ది అన్ టచ్‌బుల్స్’ చిత్రంలో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.