బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెలకు పెళ్లికి ముందు నుంచే వీరిద్దరికీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రణ్‌వీర్ తరచూ తన ప్రియమైన సతీమణి దీపిక ఫొటోల్ని, ఆమెకు సంబంధించిన విశేషాల్ని షేర్ చేస్తూ.. మంచి భర్త అనిపించుకున్నారు. ఆమెపై ఉన్న ప్రేమను బయటపెడుతూ.. నెటిజన్లను ఫిదా చేశారు. తాజాగా ఆయన చేసిన మరో కామెంట్ అభిమానుల్ని ఫిదా చేసింది. ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌క్లబ్ షేర్ చేసింది.
ఈ సందర్భంగా ‘చాలా రోజుల ట్రిప్ తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే మీరు చేసే మొదటి పని ఏంటి?’ అని రణ్‌వీర్‌ను అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘నా భార్యను లాక్కుని ముద్దుపెడతా’ అని తడుముకోకుండా సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన జవాబు నెటిజన్లను కట్టిపడేసింది. ‘రణ్‌వీర్ సోక్యూట్, మీ కెమిస్ట్రీ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇప్పుడు నాకు నిన్ను ముద్దుపెట్టుకోవాలని ఉంది..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు.
దీపికతో దాదాపు ఆరేళ్ల ప్రేమ తర్వాత రణ్‌వీర్ ఆమెను వివాహం చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఇటలీలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దీప్‌వీర్ సోషల్‌మీడియాలో ఒకరిఫొటోలకు మరొకరు కామెంట్స్ చేసుకుంటూ.. స్పెషల్ జోడీగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి రణ్‌వీర్ ఎక్కువగా దీపిక ఫొటోలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం వీరిద్దరు ’83’ సినిమా కోసం జంటగా నటిస్తున్నారు. కపిల్‌దేవ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క దీపిక నటించిన ‘ఛాపక్’ విడుదలకు సిద్ధమౌతోంది.