
1st 100 crore Bollywood movie:
ప్రస్తుతం సినిమాలు ఎంత కలెక్షన్ తెచ్చుకున్నాయి అనే విషయాన్ని బట్టి వాటి హిట్ ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. 100 కోట్లు దాటడం సాధారణంగా మారిపోయింది. కానీ 80వ దశకంలో ఓ సినిమా 100 కోట్ల మార్క్ అందుకోవడం నిజంగా విశేషమే. చాలామంది Hum Aapke Hain Koun (1994) సినిమానే తొలి 100 కోట్ల హిట్‌గా భావిస్తారు. కానీ అసలు 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ సినిమా డిస్కో డాన్సర్ (1982).
మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమా బబ్బర్ సుభాష్ దర్శకత్వంలో రూపొందింది. మ్యూజికల్ థీమ్‌తో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని సాధించింది.
భారతదేశంలో ఈ సినిమా రూ.6 కోట్లు వసూలు చేసింది. కానీ అసలు మేజర్ సక్సెస్ సొవియట్ యూనియన్ (రష్యా) నుంచి వచ్చింది. అక్కడ 1984లో విడుదలైన ఈ సినిమా 12 కోట్ల టికెట్లు అమ్ముకుంది. దీనివల్ల ఈ మూవీ అక్కడే రూ. 94.28 కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తం గా కలిపితే ఈ సినిమా రూ. 100.68 కోట్లు వసూలు చేసి భారతదేశపు మొదటి 100 కోట్ల మూవీగా నిలిచింది.
1975లో వచ్చిన షోలే సినిమా అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా. ఈ సినిమా రూ. 30 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. కానీ డిస్కో డాన్సర్ మూడు రెట్ల ఎక్కువగా వసూలు చేసి, 12 ఏళ్లపాటు భారతదేశపు హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. చివరకు Hum Aapke Hain Koun (1994) మూవీ రూ. 128 కోట్లతో ఈ రికార్డును బ్రేక్ చేసింది.
ఈ సినిమాకు బప్పీ లహిరి అందించిన మ్యూజిక్ బిగ్ హిట్ అయ్యింది. Jimmy Jimmy Aaja Aaja లాంటి పాటలు మిథున్ చక్రవర్తికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా రష్యా, చైనా దేశాల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. మెరుస్తున్న డ్రెస్సులు, అదిరిపోయే డాన్స్ మూవ్స్‌తో మిథున్ అప్పట్లో స్టైల్ ఐకాన్‌గా మారిపోయాడు.