HomeTelugu Trending'ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో' టీజర్‌

‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ టీజర్‌

First Day First Show Movie

‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ ఆనంద్ కె.వి హిలేరియస్ అంశాల నేపథ్యంలో కథ అందించిన చిత్రం ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` వంశీధర్ గౌడ్ లక్ష్మీ నారాయణ పుట్టంశెట్టి ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. పూర్ణోదయా క్రియేషన్స్ శ్రీజా ఎంటర్ టైన్ మెంట్స్ మిత్ర విందా మూవీస్ బ్యానర్ లపై ఏడిద శ్రీరామ్ సమర్పణలో శ్రీజ ఏడిది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ టీజర్ ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విజువల్స్ బాగున్నాయని యంగ్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తోందని ప్రశంసించారు. 2001 ప్రాంతంలో జరిగే కథగా ఈ సినిమా వుండబోతోందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. వెన్నెల కిషోర్, తనికెళ్లభరణి, సీవీఎల్ శ్రీనివాసరెడ్డి, గంగవ్వ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu