HomeTelugu Trendingబాలీవుడ్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

బాలీవుడ్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం

8a 1
బాలీవుడ్ మూవీ ‘కూలీ నెంబర్ 1’ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న కూలీనెంబర్ 1 చిత్రం కోసం ముంబైలోని ఫిల్మిస్తాన్‌ స్టూడియోలో ఓ సెట్‌ను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్నిప్రమాదంలో సెట్‌తో పాటు కొన్ని లైట్లు, పరికరాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో సెట్‌లో 15 మంది కార్మికులు ఉన్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాకు ఇన్సూరెన్స్ చేయడం వల్ల ప్రమాదంలో జరిగిన నష్టం చాలా వరకు కవర్ అయ్యే అవకాశం.

గతంలో గోవింద, కరిష్మా కపూర్ నటించిన కూలీ నెం.1 చిత్రాన్ని అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో షూటింగ్ చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, సకాలంలో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బందికి, ముంబైపోలీసులకు సోషల్‌ మీడియా ద్వారా సినీ నిర్మాత జాకీ భగ్నానీ ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదంలో ఎంతమేర నష్టం జరిగిందీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదం జరగడంతో కొద్దిరోజులపాటు సినిమా షూటింగ్ వాయిదా వేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu