క్రేజీ విజయ్ దేవరకొండ తనపై ఫేక్ న్యూస్‌ను వేలెత్తి చూపించాడు. తన పై వస్తున్న తప్పుడు వార్తలపై మండిపడ్డాడు. తాను స్థాపించిన ‘మిడిల్ క్లాస్ ఫండ్’ కార్యకలాపాల్ని ఎద్దేవా చేస్తూ – సామాజిక సృహ లేకుండా ప్రవర్తించిన ఓ వెబ్ సైట్‌పై – విరుచుకుపడుతూ ఓ వీడియో రూపొందించాడు విజయ్. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విజయ్‌కు సపోర్ట్ గా నిలిచింది. మహేష్, చిరు తో పాటు హరీష్ శంకర్, కొరటాల, రవితేజ, క్రిష్ సపోర్ట్ గా నిలిచారు. ”విజయ్ వి స్టాండ్ విత్ యూ” అంటూ రీప్లయ్‌లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశం ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. గతంలో ఇలాంటి సమస్యే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కూడా బాధించింది. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో చాలా మంది పవన్ పై తప్పుడు వార్తలు రాశారు. జనసేన పార్టీ పెట్టి రాజకీయాలో అడుగు పెట్టిన క్షణం నుంచి పవన్ పై ఎన్నో తప్పుడు వార్తలు పుట్టుకొచ్చాయి. చాలా సందర్భాల్లో మౌనంగా ఉన్న జనసేనాని , కొన్ని విషయాల్లో మాత్రమే ఇలానే బయటకు వచ్చి తన పై తప్పుడు వార్తలు రాసిన వారిపై విరుచుకుపడ్డారు. కానీ పవన్ కు సపోర్ట్ గా సినీ తారలు ఎవ్వరు గొంతు విప్పలేదు. ఎవ్వరు పవన్ కు సపోర్ట్ గా మాట్లాడలేదు. పవన్ కు మద్దతు తెలుపకపోవడానికి కారణం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. బహుశా పవన్ సినిమా ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లడమే అయ్యుండొచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా విజయ్ కు మాత్రం ఇప్పుడు ఊహించని సపోర్ట్ లభిస్తుంది. ఇప్పుడు ఈ అంశం ట్వీటర్‌లో వైరల్ అవుతుంది.
People need t knw…🙏 pic.twitter.com/cS4d6184tC
— కరోనాతో కలిసి జీవించాలి (@ram_jspk) May 5, 2020
— butchiraj (@hi2cherry) May 5, 2020