
MS Dhoni daughter Ziva Dhoni school:
భారత క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ కోట్లాదిమందికి ఆదర్శం. తన శాంత స్వభావం, తెలివైన వ్యూహాలతో టీమిండియాను వరుస విజయాల బాటలో నడిపించాడు. అయితే, క్రికెట్ మైదానం వెలుపల ధోనీ కుటుంబం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
2010లో ధోనీ, తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షి రావత్‌ను వివాహం చేసుకున్నారు. 2015, ఫిబ్రవరి 6న వీరికి కుమార్తె జీవా సింగ్ ధోనీ జన్మించింది.
తండ్రిలానే జీవా ధోనీ కూడా ఎంతో పాపులర్. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. జీవా పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
జీవా ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ‘టౌరియన్ వరల్డ్ స్కూల్’ లో చదువుతోంది. ఇది 2008లో అమిత్ బాజ్లా స్థాపించిన స్కూల్. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అల్యూమ్నస్, ప్రస్తుతం ఈ విద్యాసంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్కూల్ విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తుంది. సాధారణ చదువులతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్, హార్స్ రైడింగ్, స్పోర్ట్స్ వంటి ప్రత్యేకమైన కోర్సులను అందిస్తుంది. విద్యార్థులు విద్యతో పాటు మానసిక, శారీరక అభివృద్ధిని పొందేలా ప్రణాళిక ఉంటుంది.
టౌరియన్ వరల్డ్ స్కూల్ ఫీజు వివరాలు
LKG – 8వ తరగతి: రూ. 4.40 లక్షలు వార్షిక ఫీజు
9వ తరగతి – 12వ తరగతి: రూ. 4.80 లక్షలు ఫీజు
ఈ ఫీజులో యూనిఫామ్, టెక్స్ట్‌బుక్స్, ఇతర లెర్నింగ్ మెటీరియల్స్ అన్ని కలిపి ఉంటాయి. ఇండియా టుడే మ్యాగజైన్ ప్రకారం, రాంచీ, ఝార్ఖండ్‌లో నంబర్ 1 బోర్డింగ్ స్కూల్‌గా నిలిచింది.