జాతిరత్నాలు సినిమాతో ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాధించుకుంది హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. సోషల్ మీడియా ను బాగా వాడుకుంటూ తనలోని డాన్స్ టాలెంట్ ని బయటపెట్టింది ఫరియా. ప్రస్తుతం వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా రూపొందుతున్న రావణాసుర లో హీరోయిన్ గా నటిస్తోంది ఫరియా.
ఇక ఈ బ్యూటీ విజయ్ ఆంటోనీతో జతకట్టబోతోన్నట్టు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఫరియా కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 80లలో పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ ప్రాజెక్టు షూటింగ్ మే లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ సినిమాలంటే బాక్సాపీస్ దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది.