Mega Hero Movies:
మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల వరుసగా ఫ్లాపులతో తన మార్కెట్‌ను కోల్పోతున్నారు. గత కొంతకాలంగా వచ్చిన ‘ఘని’, ‘గాంధీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలు భారీగా దెబ్బతిన్నాయి. తాజాగా వచ్చిన ‘మట్కా’ కూడా పెద్ద షాక్‌గా మారింది. ఈ చిత్రం తీవ్ర డిజాస్టర్ గా.. అత్యంత తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రాల వల్ల నిర్మాతలు భారీ నష్టాలు పొందారు. వరుణ్ తేజ్ సినిమాల కోసం థియేట్రికల్, నాన్-థియేట్రికల్ మార్కెట్ కూడా పెద్ద మొత్తంలో పడిపోయింది. ప్రేక్షకులు ఆయన స్క్రిప్ట్ ఎంపికలు, దర్శకుల ఎంపికపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయవంతమైన గుర్తింపు పొందిన దర్శకులతో పని చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు.
View this post on Instagram
ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ, విక్రమ్ సిరికొండ లాంటి దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీరిద్దరూ గతంలో పెద్ద విజయాలను అందించలేదు. మేర్లపాక గాంధీ ఇటీవల హిట్స్ లేక సతమతమవుతున్నారు. విక్రమ్ సిరికొండ అయితే రవితేజతో చేసిన ‘టచ్ చేసి చూడూ’ తర్వాత అసలు కనిపించలేదు.
ఇలాంటి డైరెక్టర్లతో కలిసి పని చేయడం, మార్కెట్ తగ్గిపోవడం వరుణ్ నిర్మాతలను ఆందోళనలోకి నెడుతోంది. వరుణ్ తేజ్ ఇప్పుడు తన ప్రాజెక్ట్ సెలెక్షన్ ను పూర్తిగా మార్చి, సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం అతని కెరీర్ కీలక దశలో ఉంది. మంచి కథలతో గేమ్ ప్లాన్ మార్చుకుంటేనే ఆయన తిరిగి మెగాహీరోగా నిలబడగలరు. మరి వరుణ్ తన వైఖరి మార్చుకుంటాడా లేదా చూడాలి.
ALSO READ: Kanguva సినిమా డిజాస్టర్ తర్వాత Suriya సినిమా బడ్జెట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!