
Allu Arjun Atlee Movie:
ప్రముఖ దర్శకుడు అట్లీ తన ఆరవ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా A6 అనే టైటిల్ పక్కాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌ను తీసుకోవాలని అట్లీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే, ఫ్యాన్స్‌కి మాత్రం భారీ ఫెస్టివల్ అని చెప్పొచ్చు.
అయితే అసలు హైలైట్ ఏంటంటే – ఈ సినిమాకి ప్రియాంక చోప్రాను కూడా తీసుకోవాలని అట్లీ చూస్తున్నాడట! ఇప్పటికే హాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక, అట్లీ సినిమాతో మళ్లీ ఇండియన్ స్క్రీన్ పై దర్శనం ఇవ్వనుందా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో ఉంది.
ప్రియాంక చోప్రా ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే SSMB29 సినిమాలో మహేష్ బాబుతో జతకట్టబోతున్న సంగతి తెలిసిందే. అలాంటి టైంలో అట్లీ సినిమా అంటే అంచనాలు డబుల్ అయిపోతాయి. అయితే కొన్ని కామెంట్స్ ప్రకారం, అల్లు అర్జున్ – ప్రియాంక కాంబినేషన్ పక్కగా మ్యాచవకపోవచ్చు అని కొందరంటున్నారు, వయస్సు డిఫరెన్స్ కారణంగా. కానీ అట్లీ స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ కాంబోకూడా మెచ్చిపోతారేమో చూడాలి.
ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్. కానీ అట్లీ ఇప్పటివరకు అధికారికంగా ఏ సమాచారం బయటకు చెప్పలేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే ఒక క్లారిటీ రానుందన్న ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రియాంక అల్లుఅర్జున్ కాంబో వర్కౌట్ అయితే ఇది పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ అందుకోవచ్చునని భావిస్తున్నారు.
ALSO READ: రెమ్యూనరేషన్ విషయంలో Rashmika Mandanna కొత్త డిమాండ్ విని నిర్మాతలు షాక్