
Nandamuri Mokshagna debut movie heroine:
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీపై ఎన్నో ఏళ్లుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. “ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది” అంటూ రూమర్లు వస్తున్నా, ఇప్పటికీ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. మొదట బోయపాటి శ్రీను, వివి వినాయక్, బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చినా, చివరికి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో సినిమా ఫిక్స్ అయింది.
మోక్షజ్ఞ లుక్ కూడా గతంలో రిలీజ్ చేయగా, సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొదట కృతి శెట్టి, శ్రీలీల పేర్లు వినిపించగా, శ్రీలీల ఫిక్స్ అయినట్టుగా టాక్ వచ్చింది. కానీ, ఇది కచ్చితమైన సమాచారం కాదు.
అయితే, నందమూరి అభిమానులు మాత్రం “మాకు శ్రీలీల వద్దు, మీనాక్షి చౌదరినే హీరోయిన్‌గా చూడాలి” అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. “మోక్షజ్ఞ – మీనాక్షి కాంబినేషన్ హిట్ అవుతుంది”, “వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కనెక్ట్ అవుతుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమా వదిలేశాడనే రూమర్లకు అడ్డుకట్ట పడింది. కానీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇంకా స్పష్టత లేదు. మోక్షజ్ఞ ఎంట్రీని ఎంత ఆలస్యం చేస్తే, ఆంతగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఫైనల్‌గా హీరోయిన్ ఎవరు? మీనాక్షి చౌదరిగా ఫిక్స్ అవుతుందా? లేక శ్రీలీలానే కన్ఫర్మ్ చేస్తారా? అనేది చూడాలి.