
Prabhas village in Nepal:
మనకు తెలిసినట్లుగా ప్రాంతాలకు స్వాతంత్ర్య యోధుల పేర్లు, వీధులకు స్టార్స్ పేర్లు, రైల్వే స్టేషన్లకు క్రికెటర్ల పేర్లు పెట్టడం కామన్. కానీ ఇప్పటివరకు ఒక సౌత్ ఇండియన్ హీరో పేరు మీద ఊరు ఉందంటే? అవును, ప్రభాస్ అనే పేరుతో ఓ ఊరు ఉంది! అయితే ఇది మన భారతదేశంలో కాదు, నేపాల్‌లో ఉంది.
ఇటీవల మోటో వ్లాగింగ్ ఎక్కువగా పెరుగుతోంది. బైక్ మీద ప్రయాణిస్తూ చిన్న చిన్న గ్రామాలను ఎక్స్‌ప్లోర్ చేయడం యువతకు కొత్త ట్రెండ్. ఓ బైక్ వ్లాగర్ ఇండియా నుంచి నేపాల్‌లోని పోక్రా వెళ్తూ ‘ప్రభాస్’ అనే బోర్డు చూశాడు. అది ఒక గ్రామం పేరు! ఈ విషయం తనకు చాలా ఆసక్తిగా అనిపించడంతో, వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
“పోక్రాకు వెళ్తున్న దారిలో వాటర్ బ్రేక్ కోసం ఆగాను. అక్కడ ‘ప్రభాస్’ అనే ఊరి పేరు చూసి నేను ఆశ్చర్యపోయాను. డార్లింగ్ ఫ్యాన్స్ చూస్తే ఖచ్చితంగా ఆనందిస్తారు అని వీడియో చేశాను” అంటూ ఆ వ్లాగర్ చెప్పాడు.
ఈ వీడియోతో ప్రభాస్ ఊరి గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఒక హీరో పేరు మీద ఊరు ఉండటం నిజంగా గొప్ప విషయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఊరికి ప్రభాస్ పేరు ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ ‘డార్లింగ్’ పేరుతో ఒక ఊరు ఉందనే విషయమే ఫ్యాన్స్‌కి సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇక ప్రభాస్ సినిమాల గురించి చెప్పాలంటే, ప్రస్తుతం ‘ద రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆగస్టు 2025కి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రభాస్ కెరీర్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మరింత స్థాయికి ఎదిగాడు. సలార్ 2, కల్కి 2898 AD పార్ట్ 2, స్పిరిట్ వంటి భారీ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
ALSO READ: India’s First Recording Artist 1902 లో అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?