HomeTelugu Big Storiesమరింత సన్నబడ్డన కీర్తి సురేష్‌.. నెటిజన్ల అసంతృప్తి

మరింత సన్నబడ్డన కీర్తి సురేష్‌.. నెటిజన్ల అసంతృప్తి

Fans disappointed keerthi s
టాలీవుడ్‌లో ‘నేను.. శైలజా’ సినిమాతో హీరోయిన్‌గా ఏంట్రీ ఇచ్చింది‌. ఈ మూవీలో ముద్దుగా, బొద్దుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మహానటి సావిత్రి బయోపిక్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే చాన్స్‌ కొటేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్‌కి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకుంది.

అయితే ఈ మధ్య కీర్తి డైట్‌ అంటు సన్నబడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన రంగేదే మూవీలో కీర్తి బక్కచిక్కినట్లుగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు ‘‘అయ్యో మరీ ఇంతలా సన్నబడిపోయారేంటి.. ఇలా అస్సలు బాగాలేరు, బొద్దుగానే బాగున్నారు’’ అంటూ తమ అసంతృప్తిని కామెంట్స్‌ రూపంలో వ్యక్తం చేశారు. ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేసి తన అభిమానులను మరోసారి నిరాశ పరిచారు కీర్తి.

‘నిశ్శబ్దం, యోగా నా దినచర్యలో భాగమైంది’ అంటు షేర్‌ చేసిన ఈ వీడియోలో కీర్తిని చూసి అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో ఆమె మరింత సన్నగా కనిపించడంతో ‘మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు.. ఇదంతా దేనికి, అంత అవసరం ఏమొచ్చింది’ అంటు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం కీర్తి మహేశ్‌ బాబు హీరోగా చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu