టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది. సవ్యశాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తార తార నిధి అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. ఇటీవల ఎనర్జిటిక్ హీరో రామ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బీజీగా ఉంది. తాజాగా నిధి తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది. పవన్-క్రిష్ కాంబోలో రానున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా చేసే లక్కీ చాన్స్ కొట్టేశారు.
తమ అభిమాన నటి నిధికి తెలుగు తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేగాక విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో నిధి ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత అభిమానం ఉంటే ఇలా విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారని నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయం నిధి దాకా చేరిందో లేదో తెలీదు. ఒకవేళ తెలిస్తే ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. ఇక కొందరు నెటిజన్లు నిధి ఏం చేసిందని గుడి కట్టారు అంటూ ప్రశ్నిస్తున్నారు.