మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా ఓ అభిమాని. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని బియ్యపు గింజలతో ఇలా చాటుకున్నాడు. అంతేకాదు.. ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు నడిచి రామ్ చరణ్ ను చేరాడు. చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు.
An ardent fan named Jairaj creates an artistic portrait of #RamCharan with rice crops in his paddy field in Gorlakhan Doddi, Gadwal.
He walked 264 KMs to meet @AlwaysRamCharan and explain about his artefact. pic.twitter.com/pkbOnVcRJQ
— Suresh Kondi (@SureshKondi_) May 28, 2022