ఓ డైరెక్టర్ కోర్కె తీర్చమని తనను వేధించాడని కోలీవుడ్ నటి షమ్ము తెలిపారు. తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇటీవల శివ కార్తికేయన్ ‘మిస్టర్ లోకల్’ సినిమాలో కనిపించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రశ్నించారు. ‘మీకు ‘మీటూ’ సంఘటనలు ఎదురయ్యాయా? దాని వల్ల మీరు ఏవైనా అవకాశాల్ని కోల్పోయారా?సూటిగా సమాధానం చెప్పండి’ అని అడిగారు. దీనికి నటి స్పందిస్తూ.. ‘నేను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. కానీ ఫిర్యాదు చేయను. ఇలాంటి ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఒకవేళ నేను ఫిర్యాదు చేసినా లాభం ఏంటి?. ఎదుటి వ్యక్తి (నిందితుడు) తను చేసిన తప్పును ఒప్పుకుంటాడని మీరు అనుకుంటున్నారా?క్రేజీ ప్రపంచం (విసుగుతో తల కొట్టుకుంటున్న ఎమోజీ)’.
‘కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ దర్శకుడు తన కోర్కె తీర్చితే.. విజయ్ దేవరకొండతో తీస్తున్న కొత్త సినిమాలో అవకాశం ఇస్తానని అన్నాడు’ అంటూ షమ్ము సూటిగా సమాధానం ఇచ్చారు.