Bigg Boss 8 Telugu Family Week:
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో గౌతం కృష్ణ, విష్ణు ప్రియ లకు ఇది ఒక గేమ్-చేంజింగ్ ఎపిసోడ్‌గా నిలిచింది. ఈ ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించడం అందరికీ కొత్త అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా విష్ణు ప్రియ తండ్రి ఇంటికి రావడం ద్వారా విష్ణు ప్రియకి కొత్త ఊపిరి వచ్చినట్లయింది. ఆయన మంచి స్వభావం అందరికీ నవ్వులు పంచింది. ఎవరూ ఊహించని విధంగా చాలా స్నేహపూర్వకంగా ఆత్మీయత చూపించారు.
విష్ణు ప్రియ తండ్రి వచ్చిన వెంటనే, తన కుమార్తెకు ముఖ్య సూచనలను ఇచ్చారు. విష్ణు ప్రియ ను ప్రుత్వి పైన ఆధారపడవద్దని, పూర్తిగా ఆటపై దృష్టిపెట్టాలని అన్నారు. ఈ ఎపిసోడ్‌తో ప్రేక్షకులు విష్ణు ప్రియ నిజాయితీని అర్థం చేసుకుంటే, ఆమె ప్రుత్వి పైన ఆధారపడకుండా ఆటలో టాప్ 5లోకి చేరే అవకాశం ఉంది. కానీ ఇంకా ఆమె ఆటపై దృష్టిపెట్టకపోతే, విజయం దూరంగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ ఎపిసోడ్ విష్ణు ప్రియకు చాలా పాజిటివ్‌గా మారింది.
ఇక ప్రుత్వి తల్లి కూడా విష్ణు ప్రియ పట్ల సానుకూలంగా స్పందించడం విశేషం. ఆమె విష్ణు ప్రియ గురించి మంచి మాటలు మాట్లాడి, ప్రుత్వి-విష్ణు ప్రియ మధ్య ఉన్న సంబంధాన్ని సరదాగా తీసుకున్నారు. ఈ అంశం కూడా విష్ణు ప్రియకు ప్రేక్షకుల నుండి పాజిటివిటీ పొందడానికి ఉపయోగపడింది.
తర్వాత గౌతం కృష్ణ సోదరుడు కూడా ఇంట్లోకి ప్రవేశించి గౌతం కు సరైన సూచనల్ని అందించారు. గౌతం గ్రూప్ గేమ్‌ను బహిర్గతం చేసి, స్వతంత్రంగా తన ఆటను కొనసాగించాలని సూచించారు. అన్ని సంబంధాలను విడిచిపెట్టి తనను తాను మాత్రమే నమ్ముకుని ఆటలో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంట్లో బయట అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పడంతో గౌతంకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది.
ఈ సూచనల్ని సరిగ్గా అర్థం చేసుకుని, గౌతం తన గేమ్‌ని బలంగా మార్చుకుంటే ఫైనల్‌లో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి. ఇలా ఫ్యామిలీ వీక్ ఇంట్లో ఉన్న చాలామంది కంటెస్టెంట్లకి గేమ్ చేంజర్ గా మారింది. ముఖ్యంగా ఈవారం ఎలిమినేట్ అది అవకాశాలు ఎక్కువగా ఉన్న విష్ణు ప్రియ మీద కొంత పాజిటివిటీని కూడా పెంచింది. మరి ఈ ఎపిసోడ్ తర్వాత ప్రేక్షకులు ఆమెకు ఓట్లు కూడా ఎక్కువ వేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
ALSO READ: VD12 సినిమాకి బాలయ్యకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?