HomeTelugu TrendingFamily Star: కథలు కాపీ చెయ్యాలా? కొత్త థాట్స్ రావా?

Family Star: కథలు కాపీ చెయ్యాలా? కొత్త థాట్స్ రావా?

Family Star:Family Star: విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీతా గోవిందం’ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. పరశురామ్‌తో మరోసారి సినిమా తీశాడు విజయ్‌. ఈ సినిమాపై విజయ్‌ చాలా హోప్స్‌ పెట్టుకున్నాడు. ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేశాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

కథలోకంటెంట్‌ లేకపోవడంతో ఈ సినిమా మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ బావున్నాయి. అయితే, ఫ్యాన్స్ ఆశించింది ఇలాంటి సినిమా కాదు. ఈక్రమంలో.. ప్రేక్షకులు మూవీ డైరెక్టర్‌ని బాగా రోస్ట్‌ చేస్తున్నారు. సినిమా తీయడానికి కథ ఉండాలా ఏంటి? అంటూ ఒకరు, కామన్ మ్యాన్ గురించి ఈ మాత్రం చెప్పే దానికి సినిమాయే తీయాలా ఏంటి? పుస్తకం రాస్తే సరిపోద్దిగా అంటూ ఇంకొకరు… ఒక్కొక్కరూ ఒక్కోలా ట్రోల్ చేస్తున్నారు.

రివ్యూస్, రిజల్ట్ సంగతి పక్కన పెడితే… డైరెక్టర్ పరశురామ్ రైటింగ్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అవ్వడమే కాదు, పాత సినిమాలను కాపీ చేసి దొరికిపోయాడు అంటున్నారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్టాఫ్ మీద మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ ఇన్ఫ్లూయెన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. ఆ సినిమాలో అన్నదమ్ముల్లో చిరంజీవి చిన్నోడు. అన్నయ్యలో ఒకడు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇల్లు ఖాళీ చేయించడంతో, ఆ పని చేసిన చిరు ఇంటికి విజయశాంతి వస్తుంది.. ఫ్యామిలీ స్టార్‌లోనూ అదే చూపించారు.

ఇది పక్కన పెడితే.. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు కిక్‌ ఇస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక మళ్లీ కాపీ మరకలు కనిపిస్తాయి. వరుణ్ తేజ్, రాశీ ఖన్నాల ‘తొలిప్రేమ’ గుర్తుకు వస్తుంది. థీసిస్ కంప్లీట్ చేసిన డబ్బున్న హీరోయిన్ మిడిల్ క్లాస్ గురించి చెబుతుంటే కత్రినా కైఫ్ ‘మల్లీశ్వరి’ సీన్, క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’ను గుర్తు చేశాయని ఆడియన్స్ అంటున్నారు. ఒక్క కథ కోసం ఇన్ని సినిమాలను మిక్సీలో వేసి కిచిడీ చేయాలా? కథ రాయాలంటే కాపీయే చెయ్యాలా ఏంటి? కొత్త థాట్స్ రావా? అంటూ విజయ్‌ ఫ్యాన్స్‌ మండి పడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu