Family Star : రౌడీ హీరో విజయ్ దేవరకొండ -మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘గీత గోవిందం’ తరువాత.. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ కూడా ప్రేక్షకల్లో ఆసక్తిని కలిగించే ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై హైప్స్ పెరిగాయి.
‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీత అందిచాడు. కాగా ఈ సినిమా ఉగాది కానుకగా (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హైదరాబాద్‌లో మీడియా వాళ్ళకి, ఇండస్ట్రీ ప్రముఖులకు సినిమా చూపించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన కొందరు ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా కామెడీతో సాగుతుందట. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్, అతని నటన ఆకట్టుకునే విధంగా ఉంటాయట. యాక్షన్ సీక్వెన్స్..లతో అతను మాస్ ఆడియన్స్ ని కూడా దగ్గరయ్యే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పర్సన్స్ ప్రతి ఒకరు తమ బయోపికే అనుకుంటారని మేకర్స్ వివరించారు.
తర్వాత హీరోయిన్ మృణాల్ హీరోని ‘ఏవండీ’ అని పదే పదే పిలవడం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెబుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ గా సాగుతుందట. క్లైమాక్స్ కూడా పర్వలేదు అనిపిస్తుంది అంటున్నారు. హీరో, హీరోయిన్లు క్యారెక్టర్జేషన్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారని వివరించాడు. కథలో కొంచెం చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ పోలికలు ఉన్నప్పటికీ.. పరశురామ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అంటున్నారు.