Mahanati Facts:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా.. మహానటి సినిమా 2018 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది అని చెప్పుకోవచ్చు. కలెక్షన్లతో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నేషనల్ అవార్డులు కూడా అందుకుంది. కానీ సినిమాలో చూపించినవి అన్ని నిజాలు మాత్రమే కాదు. సావిత్రి జీవితంలోని కొన్ని చేదు నిజాలు చీకట్లోనే ఉండిపోయాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
సినిమాలో చూపించినట్లు సావిత్రి సవతి తండ్రి ఆమెను ప్రేమగా చూసుకోలేదు. అతను డబ్బు మనిషి. అంతేకాకుండా సినిమాలో సావిత్రి తల్లి గురించి చూపించిన దాంట్లో కూడా నిజం లేదు. నిజానికి సావిత్రికి తన తల్లితో కూడా సత్సంబంధాలు లేవు.
చిన్నప్పటి నుంచి ప్రేమ కోసం తపించి పోయిన సావిత్రి.. ఒకే ఒక్క వ్యక్తి తన జీవితంలో ఉన్న ఖాళీలన్నింటినీ పూరిస్తాడు అని నమ్మింది. కానీ ఆ మనిషి కూడా మోసం చేయడంతో ఆమె భరించలేకపోయింది.
సావిత్రి దగ్గర బాగా డబ్బులు ఉన్న సమయంలో.. తమిళనాడులోని ఒక వీధి వీధి మొత్తం ఆమె పేరు మీద ఉండేది. అందులో అన్నీ ఆమె ఇళ్లే ఉండేవి. కానీ చివరి దశల్లో మాత్రం ఆమె ఒక పూరి గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకప్పుడు షూటింగ్ సమయంలో ఒక పెద్ద గోను సంచిలో డబ్బులు తీసుకుని వెళ్లి.. లేని వాళ్ళందరికీ పంచిపెట్టేది. కానీ అందులో ఒకరు కూడా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు.. ఆమెకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు.
తమిళనాడులోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో సావిత్రి అతని ఒక కుక్కతో పోల్చింది. అప్పటినుంచి ఆమె మీద పగ పట్టిన ఆ రాజకీయ నాయకుడు.. పవర్ లోకి రాగానే ఆమె మీద ఇన్కమ్ టాక్స్ రైడ్ లు జరిపించి ఆమె ఆస్తులన్నిటిని జప్తు చేయించాడు. చాలాకాలం కోర్టులో నడిచిన తర్వాత.. మళ్లీ ఆ ప్రాపర్టీలు సావిత్రి కి దక్కాయి.
ఒక బాగా డబ్బు ఉన్న ఎన్నారై కి ఇచ్చి సావిత్రి తన కూతురికి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించింది. కానీ కన్న కూతురు కూడా ఆమెను చివరి దశలో పట్టించుకోలేదు. ఆమె చనిపోయిన తరువాత మాత్రం తన ప్రాపర్టీలను తీసుకోవడం కోసం ముందుగా వచ్చేసింది. సావిత్రి పిచ్చిగా ప్రేమించిన వాళ్లందరూ ఆమె ను మోసం చేసిన వారే.
నటిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న సావిత్రి మనసు బంగారం. కానీ ఆమె చివరి రోజుల్లో పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడనివి. నిజానికి సావిత్రి జీవితం చాలామందికి గుణపాఠం లాంటిది. అతిగా ఎవరిని నమ్మకూడదు అని, పెళ్లి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని.. సావిత్రి జీవితం మనకు నేర్పిస్తుంది.