సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 2’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ను వెంకీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.