Nagarjuna’s car collection:
టాలీవుడ్ స్టార్ నాగార్జున, తన సినిమాలతో మాత్రమే కాదు, తన లగ్జరీ జీవనశైలితో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. నాగార్జున తాజాగా లెక్సస్ LM MPV అనే లగ్జరీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారును కొన్న సంగతి తెలిసిందే.
ఈ కారు ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుంది. హైద్రాబాద్ ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఆయన ఈ కారును రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా తీసుకువెళ్లారు. ప్రత్యేకమైన మెరూన్ రంగులో కనిపించిన ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాహనం ప్రీమియం డిజైన్‌తో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించబడింది.
కారు లోపల లగ్జరీ ఏమాత్రం తగ్గకుండా ఉండే సౌకర్యాలు ఉంటాయి. సాధారణ మోడల్ ధర రూ. 2.1 కోట్ల నుండి ప్రారంభమవుతుందనే విషయం తెలిసినా, నాగార్జున ఎంపిక చేసుకున్న మోడల్ అత్యంత ఆధునిక ఫీచర్లు కలిగి ఉండడంతో ధర ఎక్కువే పడింది.
నాగ చైతన్యకు నాగార్జున ఖరీదైన బహుమతి!
టాలీవుడ్ నటుడు నాగార్జున కొత్త లగ్జరీ కారు లెక్సస్ ఎల్ఎమ్ ఎంపీవీని కొనుగోలు చేశారు. దీని ధర రూ.2.5 కోట్లు. త్వరలో శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్న నాగ చైతన్యకు బహుమతి ఇచ్చేందుకే నాగార్జున ఈ కారును కొన్నారని తెలుస్తోంది. ఈ కారును… pic.twitter.com/56z4EvPAQH
— ChotaNews (@ChotaNewsTelugu) December 1, 2024
నాగార్జునకు గ్యారేజ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కార్లు ఉండటం విశేషం. నాగ్ కారు సేకరణ ఒకసారి చూద్దాం:
*కియా EV6
*బీఎండబ్ల్యూ 7-సిరీస్
*ఆడి A7
*బీఎండబ్ల్యూ M6
*టయోటా వెల్‌ఫైర్
*నిస్సాన్ GT-R
*రేంజ్ రోవర్ వోగ్
*మెర్సిడెస్-బెన్జ్ S450
తాజాగా ఈ జాబితాలో లెక్సస్ కార్ కూడా చేరింది. కానీ నాగ్ ఈ కార్ ని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి కానుకగా ఇచ్చేశారు. డిసెంబర్ 4, 2024న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట వివాహం చేసుకోనున్నారు. అఖిల్ కూడా 2025లో జైనబ్ రవ్జీని వివాహం చేసుకోబోతున్నారు.
ALSO READ: Pushpa 2 సినిమాతో Allu Arjun, Sukumar ఎంత సంపాదించారో తెలుసా!