HomeTelugu Trendingమాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం

4 19

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌కు చికిత్స కొనసాగుతోంది. శివప్రసాద్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. శివప్రసాద్‌కు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం చికిత్సకు సహకరించడం లేదని తెలిసింది. శివప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను పరామర్శించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు చెన్నైకి వెళ్లారు.

పలు సినిమాల్లో నటించిన శివప్రసాద్ రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల్లో నటిస్తుండగానే రాజకీయాల్లోకి వచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu