
Naga Chaitanya Scuzi:
నాగచైతన్య – హీరోగానే కాదు, ఫుడ్ లవర్ గానే కూడా సూపర్ ఫేమస్. ఇప్పటికే హైదరాబాద్‌లో Shoyu అనే పాన్-ఏషియన్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించి హిట్ కొట్టిన చై, ఇప్పుడు ఇంకో కొత్త ప్రయోగం చేశాడు. ఈసారి పేరు Scuzi – కంప్లీట్‌గా కామ్ఫర్ట్ ఫుడ్ మీద ఫోకస్ చేసిన క్లౌడ్ కిచెన్!
నాగచైతన్య గోవాలో Como Agua అనే పిజ్జా ప్లేస్‌కి వెళ్లాడు. అక్కడ ఫుడ్ ఎంతో నచ్చి, ఇలాంటిదే హైదరాబాద్‌లో ఉండాలనిపించిందట. వెంటనే తన ఫ్రెండ్స్ వరుణ్ త్రిపురనేని, అర్జున్, సనియా జైస్వాల్‌తో కలిసి Scuzi ను లాంచ్ చేశాడు.
Scuziలో ఏం దొరుకుతుంది?
ఇక్కడ మెనూ చూస్తే బాగా క్రియేటివ్, టేస్టీ డిషెస్ ఉన్నాయి:
– హోమ్ రన్ బర్గర్
– ట్రఫుల్ పాస్తా (Rigatoni Bianca)
– చౌరంగీ స్టైల్ పిజ్జా
– జెర్క్ చికెన్ బౌల్
– చెర్రోస్, ట్రెస్ లెచెస్ కేక్
ప్యాకేజింగ్ కూడా బాగా ఉంటుంది. ఫుడ్ ఫ్రెష్‌గానే డెలివరీ అవుతుంది, అంటే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్!
ఇప్పటికే Scuzi స్విగ్గీ, zomato యాప్స్‌లో లైవ్‌లో ఉంది. యాప్ ఓపెన్ చేసి “Scuzi” అని సెర్చ్ చేస్తే చాలు – ఆర్డర్ ఇచ్చేయండి. ఇంట్లో కూర్చొని మంచి కామ్ఫర్ట్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక చైతూ టార్గెట్ కూడా క్లియర్ – “ఇంట్లో ఉంటూ బాగా టేస్టీ, ఫ్రెష్ ఫుడ్ తినాలనుకునే వాళ్లకి బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలన్నదే మాక్స్.”
Thandel సినిమా సక్సెస్‌తో ఉత్సాహంలో ఉన్న నాగచైతన్య ఇప్పుడు తన ఫుడ్ బిజినెస్‌కి కూడా మంచి పుష్ ఇచ్చాడు. Scuzi కూడా Shoyu లా బిగ్ హిట్ అవుతుందో చూడాలి!