L 360:మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, శోభన మరోసారి జత కట్టనున్నారు. హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ‘మోహనలాల్ 360’ సినిమాని ఎమ్. రంజిత్ నిర్మించనున్నారు. ఈ సినిమా లో శోభన హీరోయిన్‌గా గా నటించనున్నారు.
ఈ సినిమాలో భాగమైనట్లు సోషల్ మీడియాలో శోభన ఓ వీడియో పంచుకున్నారు. మోహన్‌లాల్‌గారి 360వ సినిమాలో నేను నటించబోతున్నా. నాకు గుర్తు ఉన్నంతవరకు ఆయనతో నేను కలిసి చేయబోతున్న 56వ చిత్రం ఇదిస అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక 1985లో వచ్చిన మలయాళ చిత్రం ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ లో తొలిసారి ఈ జంట నటించారు.
తదుపరి ‘మణిచిత్ర తాళు’ ‘నాడోడిక్కట్ట’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1994లో వచ్చిన మలయాళ చిత్రం తేన్మావిన్ కొంబాట్ లో మెహన్‌లాల్, శోభన లీడ్ రోల్స్‌లో నటించారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన కలిసి నటించనున్నారు. శోభన మరియు మోహన్‌లాల్ చివరిసారిగా మాంబజక్కలం (2004)లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
L360 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈసినిమాలో కలిసి నటించబోతున్నారు. 2009లో వచ్చిన ‘సాగర్’ ఆలియాస్ జాకీ రీలోడెడ్ లో మోహన్‌లాల్ హీరోగా నటించగా, శోభన గెస్ట్ రోల్ చేశారు. శోభన ఓ మలయాళ చిత్రంలో నటించి నేటికి నాలుగేళ్లు. ఆమె చివరిగా వరనే అవశ్యముండు (2020)లో ఒంటరి తల్లిగా కనిపించింది. నటుడు కల్యాణి ప్రియదర్శన్ యొక్క తల్లిగా నటించింది. అది ఒక ఛాలెంజింగ్ రోల్.
మోహన్ లాల్ విషయానికి వస్తే.. ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నందకిశోర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ నటిస్తున్నాడు. తెలుగు, మలయాళ బైలింగ్యువల్ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యాక్టర్ రోషన్ మేక కీ రోల్ పోషిస్తున్నాడు.
దీంతోపాటు మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్పలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా కాంతారా-2లో కూడా మోహన్ లాల్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దీనిపై అథికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.