ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డికి ఎదురే లేదు అనేది కూలీ మీడియా కథనాల సారాంశం. కానీ, ఆంధ్రలోని మెజార్టీ జనం జగన్‌ను తిడుతున్నారు అనేది వాస్తవం. ప్రజలు జగన్ రెడ్డితో విసిగిపోయి చంద్రబాబు కేసి చూస్తున్నారనేది కాదనలేని నిజం. కానీ సజ్జల లాంటి జలగ బలగం మాత్రం కాదు అనే అంటుంటారు. ఒకపక్క ఆ వర్గం, యీ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాలలో జగన్ రెడ్డి పాలన పట్ల తీవ్రంగా అసంతృప్తితో మదన పడుతున్నారు. జగన్ రెడ్డి పోకడలను ప్రతిఘటించడానికి ప్రజలు అతి వేగంగా సిద్ధపడుతున్నారు.
ఐతే, జగన్ రెడ్డిలో ఇంకా నటుడే ఉన్నాడు. ప్రజల నాడి యింత బాగా అర్ధం అవుతున్నా.. జగన్ రెడ్డి ఎందుకు గుడ్డిగా దైర్యంగా ఉన్నాడు ?, ఎవర్ని చూసుకుని ?. జగన్ రెడ్డి పోకడలు ప్రజలకు ఏ మాత్రం నచ్చడం లేదు అనే సంగతి జగన్ బ్యాచ్ కి తెలుసు. నిజం తెలిసినా అప్రియ భాషణం చేసి తమ నాయకుడ్ని నొప్పించడమెందుకుని అందరూ ఆగిపోతున్నారు. ఏది ఏమైనా ఎక్కువ మందికి తెలియని విషయం ఏమిటంటే.. జగన్ రెడ్డి రాజకీయాలను ఓ వ్యాపారంగా చూస్తారు.
అందుకే, కెసిఆర్, మోడీ లాంటి వారితో ఇప్పటికే ఒప్పందాలు కూడా చేసుకున్నారని రూమర్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్‌ను గెలిపించాలని కేసీఆర్ శతథా ప్రయత్నిస్తున్నారు. దానికోసం పవన్‌కు వెయ్యి కోట్ల ఆఫర్ యివ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధపడుతున్నారని టాక్. వినడానికి ఇది నమ్మేలా లేదు గానీ, ఇందులో నిజం ఉంది అని చాలామంది వాదన. 2018లో కూడా జగన్‌కు కేసీఆర్ పరోక్షంగా సాయం చేశారనే ప్రచారం బాగా ఉంది.
2024 లో రానున్న ఏపీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ‘జగన్‌కు భారీగా ఆర్థికసాయం చేయబోతున్నారు. అదే విధంగా హైదరాబాద్ నుంచి టిడిపికి నిధులు అందకుండా పోలీసుల ద్వారా కట్టడి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి టీడీపీకి ఎలాంటి నిధులు రాకుండా కెసిఆర్ కట్టడి చేస్తే, ఆంధ్ర రాష్ట్ర పరిధిలో నిధుల సరఫరా జరగదు. అప్పుడు బాబును ఇబ్బంది పెట్టవచ్చు. బహుశా జగన్ రెడ్డి ధైర్యం ఇదే కావొచ్చు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలుపుకు కూడా ప్రధానంగా ఇదే కారణం కూడా.
మళ్లీ ఇదే సూత్రాన్ని ఫాలో కావాలని జగన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే, ఓడిపోయే సూచనలు ఉన్నా దైర్యంగా ఉన్నాడు. సరే.. రాజకీయాలు ఎలా ఉన్నా.. తమ రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రులు ఉన్నారు. కచ్చితంగా ఆంధ్రులు దీన్ని అవమానంగా భావించాలి. అప్పుడే ఆంధ్రుల బతుకులకు భరోసా ఉంటుంది. కాబట్టి ఆంధ్రుల్లారా ఇకనైనా మీరు మారండి.