బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ డ్రగ్స్‌పై వివాదం . సుశాంత్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కూడా డ్రగ్స్ రాకెట్ పై పలువురిని టార్గెట్ చేసి మాట్లాడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. ఇప్పటికే నెపోటిజం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. ఆతర్వాత డ్రగ్స్ వ్యవహారం లోను వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ లో దాదాపు అందరు డ్రగ్స్ ను వినియోగిస్తారని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో డ్రగ్ మాఫియా ఉందని, డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని.. నీళ్లలా డ్రగ్స్ తీసుకుంటారని కంగనా పేర్కొంది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది కంగనా. తాజాగా కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా లైంగిక వాంఛ తీర్చాలని కంగనా తెలిపింది. రెండు నిమిషాల సీన్లో నటించాలన్నా కూడా ఆ నటి హీరోతో గడపాల్సి ఉంటుందని కంగనా అన్నది. సెట్స్ లో కూడా తమకు భార్యలా నడుచుకోవాలని కోరుకుంటారని కామెంట్స్ చేసింది. తాను ప్రత్యేకంగా ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడటం లేదని.. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాత్రమే తెలుపుతున్నానంటూ చెప్పుకొచ్చింది. సినిమా సినిమాకు హీరోలు మారుతుంటారు కానీ పరిస్థితి మారదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.