బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఈ షోకి తొలి కంటెస్టెంట్‌గా రామ్ చరణ్ విచ్చేశారు. తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమై, ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచింది. అదే జోరుని కొనసాగిస్తూ తదుపరి ఎపిసోడ్ సోమవారం వచ్చేసింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన తాజా ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అంతక ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఉండేది.. నేనే మార్చాను.. “డు” అనేది నాకు నచ్చలేదు.. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా షో కి వస్తారు కాబట్టి, పేరు మార్చాను. ఎవరు మీలో కోటీశ్వరులు అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో ప్రేక్షకుల మనస్సు మరోసారి దోచేశాడు ఎన్టీఆర్.
రామ్ చరణ్ ఓ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో లైఫ్ లైన్ ద్వారా రామ్ చరణ్.. నటుడు రానాని సంప్రదించారు. చరణ్, తారక్, రానా.. ఈ ముగ్గురి మధ్య సాగిన సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రానాను ఎన్టీఆర్ బావా అని సంభోదిస్తూ.. మాట్లాడాడు. మరి ఏ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్ రానాకి ఫోన్ చేశారు అంటే.. 11వ ప్రశ్న.
11. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీ అసలు పేరేంటి?
ఎ) చెరోకీ బి) హెర్క్యులీస్ సి) ఫోర్డ్ డి) డియాబ్లో
సమాధానం: డియాబ్లో.
* ఈ ప్రశ్నకు రానా సరైన సమాధానం చెప్పి చరణ్‌ని గెలిపించారు.
13. ఏ పాలకుడి దగ్గర బ్యూసిఫాలస్ అనే యుద్ధాశ్వం ఉండేది?
ఎ) అశోక ది గ్రేట్ బి) అక్బర్ ది గ్రేట్ సి)అలెగ్జాండర్ ది గ్రేట్ డి) ఆల్ఫ్రెడ్ ది గ్రేట్
సమాధానం: అలెగ్జాండర్ ది గ్రేట్.
* ఈ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్ ‘50-50’ లైఫ్‌ని వినియోగించుకున్నారు. సరైన సమాధానం చెప్పి రూ.25,000,00 గెలుచుకున్నారు. దాంతో కర్టెన్ రైజర్ ముగిసింది. చరణ్ గెలుచుకున్న 25 లక్షలను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.