అక్కినేని నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అలానే శాటిలైట్ రైట్స్ కోసం కూడా మంచి పోటీ నెలకొంది. చివరగా ఈటీవీ సంస్థ సుమారుగా 12.5 కోట్ల రూపాయలకు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు నాగార్జున కెరీర్ లో ఇంత ఫ్యాన్సీ రేట్ కు శాటిలైట్ రైట్స్ అమ్ముడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో నాగార్జున, రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడిపోయాయని చెబుతున్నారు. ఈ సినిమా అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్ వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.