‘రంగం’ ఫేం జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ‘యామిరుక్క బయమేన్’ ఫేమ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 31 (మార్చి 31)న రిలీజవుతోంది. ఈ సందర్భంగా..
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. ”తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై చక్కని అంచనాలేర్పడ్డాయి. అన్నిపనులు పూర్తయ్యాయి. ఈనెల 31న రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను తమిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. ట్రైలర్స్, పాటలు ఇప్పటికే శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. క్రేజీ కాంబినేషన్ జీవా, కాజల్ నటన ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది” అన్నారు.