కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో ఓ కొంచెం పాలు పంచుకుందాం. ఏమో ఏమో ఏదారుల్లో ఏ బంధం ఉందో బంధువుల సంఖ్య పెంచుకుందాం’ అంటూ సాగే ఈ పాటను ఎస్పీ బాలు అలపించారు. ఈ పాటను శుక్రవారమే విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని వాయిదా వేసి నేడు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, నరేష్, అన్నపూర్ణ, సుహాసిని కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.