HomeTelugu Trending'గుండె కథ వింటారా' నుంచి 'ఎంత బావుందో' లిరికల్‌ సాంగ్‌

‘గుండె కథ వింటారా’ నుంచి ‘ఎంత బావుందో’ లిరికల్‌ సాంగ్‌

Entha Bagundo Lyrical Video

టాలీవుడ్‌ నటుడు మధునందన్ ఒక మంచి ఆర్టిస్ట్ కం కమెడియన్ ‘గుండె కథ వింటారా’ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మధునందన్ పెద్ద సక్సెసవ్వడమే గాక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయ్యారు. 2014 నుంచి ఇప్పటివరకూ పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో మధు కీలక పాత్రల్లో నటించాడు. ఇష్క్, గీతాంజలి, టాక్సీవాలా తదితర హిట్‌ సినిమాల్లో నటించిన మధునందన్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు.

ఈరోజు ఉదయం 10.04గంటలకు విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘ఎంత బావుందో..’ పాటని రిలీజ్ చేశారు. ఈ లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆహ్లాదమైన సంగీతంతో ఆకట్టుకుంటోంది. కృష్ణ చైతన్య ఈ పాటకు లిరిక్స్ అందించారు. కృష్ణ జేకే- వరుణ్ సునీల్ ఆలపించారు. మసాలా కాఫీ టీమ్ సంగీతం అందించింది. వంశీధర్ రచించి డైరెక్షన్‌లో వహిస్తున్నారు. ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్‌లుగా నటస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శ్రీరామనవమి స్పెషల్‌ పోస్టర్లు

Recent Articles English

Gallery

Recent Articles Telugu