HomeTelugu Trendingయంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు జోడీ దొరికింది!

4 22ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఓ ఫారిన్‌ భామ నటించనున్నారు. ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సర్సన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో మరో ఇంగ్లీష్‌ బ్యూటీని వెతికే పనిలో పడ్డారు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.

తాజాగా ఎన్టీఆర్‌కు జోడి సెట్ అయినట్టుగా తెలుస్తోంది. అమెరికన్‌ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్‌ను ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌గా ఫైనల్ చేశారట. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ భామ తొలిసారిగా ఓ భారతీయ చిత్రంలో నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్‌ సినిమాలో మరో హీరోగా నటిస్తున్న రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu