‘మంగళవారం’ సినిమాపై జనాల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. టైటిల్ పోస్టర్ నుంచి టీజర్ వరకు దీనిపై అంచనాలను మరింత పెంచేశాయి. మంగళవారం ఏం జరిగిందా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రంతో డిజాస్టర్ సాధించినా ఈ సారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను ఎంచుకున్నాడు. జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. మేకర్స్ నుంచి ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు.
తాజాగా ఈ సినిమాలోని ఏమయ్యిందో ఏమిటో అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో పాయల్ తన అందా చందాలతో యూత్‌ను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా ఆర్‌ఎక్స్100లోని ఇందు పాత్రను గుర్తుచేసింది. ఆ సినిమాలోని పిల్లా రా పాటకు మించి రొమాన్స్ ఈ పాటలో కనిపించింది. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ స్వర పరిచిన ఈ పాటను హర్షిక దేవనాథ్ ఆలపించగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు.
ఇప్పటికే రిలీజైన గణగణ మోగాలిరా పాటకు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నందిత శ్వేత, రంగం ఫేమ్ అజ్మల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటీవ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.