సాదారణంగా పాఠశాలలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. స్కూల్ సమయంలో తప్పించి సాయంత్రం సమయంలో స్కూల్స్ లో ఎవరూ ఉండరు. ఎంత హయ్యర్ స్కూల్ అయినా సరే సాయంత్రం సమయం క్లోజ్ అయ్యే ఉంటుంది. అలాంటి స్కూల్ కు మహా అయితే వెయ్యో ఈరెండు వేలో కరెంట్ బిల్లు వస్తుంది. ఇంకా ఎక్కువ అనుకుంటే మరో రెండు.. అంతకు మించి ఉండదు.
అయితే, వారణాసిలోని ఓ స్కూల్ కరెంట్ బిల్లు ఏకంగా రూ. 618 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ బిల్లు చూసి టీచర్లు షాక్ అయ్యారు. ఇదేం కరెంటు బిల్లు అంటూ వాపోయారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లులో తప్పులు చూపించాయని అధికారులు అంటున్నారు. ఈనెల 7 వ తేదీలోగా బిల్లు కట్టాలని లేదంటే కరెంట్ కట్ చేస్తామని అధికారులు అంటున్నారు. రూ. 618 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అని పాఠశాల యాజమాన్యం వాపోతున్నది. ఈ బిల్లుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యింది. మోడీ నియోజక వర్గంలో బిల్లుల మోత అని నెటిజన్లు మెసేజ్ చేస్తున్నారు.