HomeTelugu Reviewsరివ్యూ: ఎక్కడకి పోతావు చిన్నవాడా

రివ్యూ: ఎక్కడకి పోతావు చిన్నవాడా

నటీనటులు: నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత, వెన్నెల కిషోర్, సత్య, తనికెళ్ళ భరణి తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాత: పి.వి.రావు
రచన,దర్శకత్వం: వి.ఐ.ఆనంద్
వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో కూడిన చిత్రాల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న
హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’. ఈ
చిత్రంలో నిఖిల్ కి జంట‌గా హెబ్బా ప‌టేల్ నందిత‌ స్వేతలు హీరోయిన్స్‌గా న‌టించారు. మేఘ‌న
ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో’టైగ‌ర్’ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా
రూపొందింది. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో..
సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
అర్జున్(నిఖిల్) చదువుకునే రోజుల్లోనే ఆయేషా(ఆవికాగోర్)ను ప్రేమిస్తాడు. ఆయేషాకు కూడా
అర్జున్ అంటే ఇష్టమే. నిజంగానే తనను ప్రేమిస్తే ఇప్పుడే పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఆయేషా.
దీంతో పెళ్ళికి ఏర్పాట్లు చేసి రిజిస్టర్ ఆఫీస్ లో తన కోసం ఎదురుచూస్తుంటాడు అర్జున్. కానీ
ఎంతసేపటికీ ఆయేషా అక్కడకి రాదు. తనను ఆయేషా వదిలి వెళ్లిపోయిందని అక్కడ నుండి
వెళ్ళిపోతాడు అర్జున్. నాలుగేళ్ళ తరువాత తన స్నేహితుడికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి
కేరళ వెళ్తాడు అర్జున్. అక్కడ అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అమల
కూడా అర్జున్ తో కలిసి నాలుగు రోజులు కేరళ మొత్తం తిరుగుతుంది. ఒకరోజు సడెన్ గా అమల
కేరళ నుండి వెళ్లిపోతుంది. అదే అమ్మాయిని సిటీలో చూసిన అర్జున్ నన్ను వదిలేసి ఎందుకు
వెళ్లిపోయావని నిలదీస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తన పేరు నిత్య అని అమల ఎవరో తనకు
తెలియదని చెప్పి వెళ్లిపోతుంది. నిత్య శరీరంలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించడం వలన
నిత్య, తనతో కలిసి ఉందని తెలుసుకుంటాడు అర్జున్. ఒకరోజు అర్జున్ కు ఓ అమ్మాయి ఫోన్
చేసి నేను అమలను నీకోసం వస్తున్నానని చెబుతుంది. ఆ తరువాత ఏం జరిగింది..? అర్జున్
దయ్యాన్ని ప్రేమిస్తాడా..? లేక దాని నుండి తప్పించుకున్నాడా..? అసలు ఆయేషా, అర్జున్ ను
పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలేంటి..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
సంగీతం
కథ
నిఖిల్
కామెడీ సన్నివేశాలు
కొన్ని కెమెరా షాట్స్
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
ఎడిటింగ్
విశ్లేషణ:
అమితంగా ప్రేమించిన అబ్బాయిని చనిపోయిన తరువాత కూడా ఆత్మగా మారి ప్రేమిస్తూ.. ఉండడం,
తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆ ఆత్మ చేసే ప్రయత్నం.. ఇదే మెయిన్ పాయింట్ గా తీసుకొని
సినిమాను నడిపించారు. మొదటి భాగంలో కాస్త ల్యాగ్ ఎక్కువగా ఉండడం ప్రేక్షకులను విసుగు
పుట్టిస్తుంది. ఇంటెర్వెల్ బ్యాంగ్ నుండి మెయిన్ స్టోరీ మొదలవ్వడంతో ఆడియన్స్ కథకు కనెక్ట్
అవుతారు. హారర్ లో నుండి పుట్టే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. కథను డైరెక్టర్ నడిపించిన
తీరు ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. నిఖిల్
తనదైన స్టయిల్ లో మెప్పించాడు. ఈ సినిమాలో నిఖిల్ ను అంత అందంగా చూపించలేదనే
చెప్పాలి. లుక్ కొత్తగా ఉంటుందని ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. హెబ్బా
తన క్యూట్ లుక్స్ తో అందంగా నటించింది. నందిత శ్వేత తన పాత్రకు సరిగ్గా సరిపోయిందనే
చెప్పాలి. కళ్ళతోనే ఎక్కువగా నటించింది. ఈ సినిమాకు మరో అసెట్ మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
అయితే ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది.
కేరళలో కొన్ని షాట్స్, సెకండ్ హాఫ్ లో దయ్యం మీద కొన్ని షాట్స్ కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్
మీద ఇంకాస్త ఫోకస్ చేస్తే బావుండేది. తక్కువ బడ్జెట్ లో జాగ్రతగా ప్లాన్ చేసుకొని సినిమా
చేశారని అర్ధమవుతుంది. ప్రస్తుతం కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ సినిమా మీద పడుతున్నా.. కథ మీద
నమ్మకంతో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాతల గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు
ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం ఏ మేరకు వస్తాయో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి
ఈ చిన్నవాడు మరోసారి తన ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ను మెప్పించాడు.
రేటింగ్: 2.75/5

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu