‘పేపర్ బాయ్’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుంది. యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ సినిమా రూపొందుతోంది. హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషల మిక్సింగ్ తో టైటిల్ మరియు ‘డజ్ సైజ్ మ్యాటర్?’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మేకర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.