HomeTelugu Trendingఈషారెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్

ఈషారెబ్బా ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్

Eesha rebbas twitter accounటాలీవుడ్‌లో ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, ‘అ’ వంటి సినిమాల్లో నటించిన ఈషాకు పెద్దగా కలిసిబ్రేక్ రాలేదు. గతేడాది ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది మెప్పించింది. బేసిగ్గా తెలుగమ్మాయి అయిన ఈషా.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె తన ఫొటో షూట్స్ మరియు ఇతరత్ర విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. ట్విట్టర్ లో ఈమెకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. తాజాగా ఈమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఈషా రెబ్బా తెలిపింది. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అకౌంట్ లేదు అనే మెసేజ్ వస్తుందని పేర్కొంది. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇప్పుడు ఈషా అకౌంట్ హ్యాక్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu