Homeపొలిటికల్AP Election 2024: ప్రభుత్వానికి బిగ్ షాకిచ్చిన ఎన్నికల సంఘం

AP Election 2024: ప్రభుత్వానికి బిగ్ షాకిచ్చిన ఎన్నికల సంఘం

EC Big Shock to AP Govt on AP Election 2024,AP Govt,ysrcp,jagan

AP Election 2024: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి నగదు బదిలీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. ఎన్నికల పోలింగ్‌ తేదీకి ముందు నగదు బదిలీ ఎందుకు చేయాలనుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో తమ ముందు ఉంచాలని ఈసీ ఆదేశించింది. ఒక్కరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.

ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. ‘బటన్‌ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది’ అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్‌ తేదీకి ముందు మాత్రమే ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని కూడా ఈసీ తేల్చిచెప్పింది. ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని వివరంగా ఇవ్వాలని తెలిపింది.

ఏప్రిల్‌, మే నెలలో ఎన్నికల కోడ్‌ వల్ల నిధులు బదిలీ చేసేందుకు ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని సీఈసీ పేర్కొంది. వారాలపాటు జాప్యం చేసి పోలింగ్‌ ముందురోజే మాత్రమే నిధులు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయించారా.. ఉంటే వాటి పత్రాలు చూపించాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన ఈసీ నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదని లేఖలో పేర్కొంది.

ఇప్పటికే బటన్ నొక్కిన 6 పథకాల డబ్బులు ఎన్నికల ముందు జమ చేసేందుకు వీల్లేదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తి అయ్యాకే లబ్దిదారులకు జమ చేయాలని పేర్కొంది. ఆ పథకాల నిధులు ఎన్నికల ముందు జమ అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రణాళికలు వేసింది. అయితే ప్రస్తుతం ఆయా పథకాలకు చెందిన నిధులు ఎన్నికలు పూర్తి అయ్యాకే లబ్దిదారులకు డబ్బులు జమ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

పథకాలకు సంబంధించి రూ.14,165 కోట్లను ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని వైఎస్సార్సీపీ భావించింది. ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు 48 గంటల్లోగా లబ్దిదారులకు జమ కాకపోవటంపై ఈసీ విస్మయాన్ని వ్యక్తం చేసింది. ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ ముందు 11, 12వ తేదీల్లో నిధులు విడుదలయ్యేలా ప్రయత్నాలు జరిగాయన్న సమచారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. పోలింగ్‌కు 2 రోజుల ముందు జమ చేస్తే కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాకే లబ్దిదారుల ఖాతాలలో జమ చేయాలని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంతో పలు పథకాల డబ్బుల జమ వాయిదా పడింది. మే 13న పోలింగ్ పూర్తి అయ్యాక ఈ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలకు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu