HomeTelugu Big Stories'ఈగల్‌' టీజర్‌

‘ఈగల్‌’ టీజర్‌

EAGLE Movie Teaser
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్ చూస్తుంటే రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయమని అనిపిస్తోంది. బాంబు పేలిన తర్వాతి దృశ్యాలతో, రవితేజ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవుతుంది.

‘కొండలో ఉన్న లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు, నీ ఉనికీ ఉండదు’ అంటూ రవితేజ పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. రవితేజ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అనుపమ పరమేశ్వరన్.. అతడు ఎక్కడుంటాడని అడగగా, అడవిలో ఉంటాడని అవసరాల శ్రీనివాస్ జవాబిస్తాడు. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు కానీ వ్యాపించి ఉంటాడని చెప్పడం సస్పెన్స్ ను రేకెత్తిస్తోంది.

నవదీప్ చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టీజర్ లో రవితేజ లుంగీ కట్టి, చేతిలో తుపాకీతో మరింత మాస్‏గా కనిపించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా, మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుక రానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu