మాస్‌మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈగల్’. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్‌లుగా నటించారు. నవదీప్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వచ్చింది.
అయితే రవితేజ నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా పూర్తయియాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ‘ఈగల్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందంతో, ఈటీవీ విన్ కూడా పోస్టర్‌ను విడుదల చేశాయి.
ఎప్పటినుంచి మూవీ అందుబాటులోకి వస్తుందన్న విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు. సినిమా ఇంకా థియేటర్‌లో ప్రేక్షకులను అలరిస్తున్న క్రమంలో ఈ మూవీ ఓటీటీలో రావడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు అని తెలుస్తుంది. విడుదల తేదీ నుంచి కనీసం నాలుగైదు వారాల తర్వాత ‘ఈగల్’ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది.