రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్. ఇటీవలే విడుదలైన ఈసినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. పోటీలో ఏ సినిమా లేకపోవడంతో మంచి టాక్‌తో ఈజీగా బ్రేక్ ఈవెన్ కొట్టేస్తాడు. లాభాలు తెచ్చి పెడతాడని అంతా అనుకున్నారు. కానీ ఈగల్ సినిమా వారం రోజులైనా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. రవితేజ రేంజ్‌కు మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి.
ఇరవై కోట్ల షేర్ రాబట్టేందుకు ఈగల్ కిందా మీద పడుతున్నట్టుగా అనిపించింది. అసలు ఈగల్ సినిమాకు ఇప్పుడు అంతగా ఆదరణ కూడా కనిపించడం లేదు. ఇప్పుడున్న టైంలో ప్రేక్షకుల్ని థియేటర్లోకి రప్పించడమే కష్టంగా మారింది. కంటెంట్ బాగుందని, సినిమా అదిరిపోయిందంటే తప్పా సినిమాకి రావడం లేదు. ఈ క్రమంలో హనుమాన్ సినిమాపై ప్రేక్షకులకు మొగ్గు చూపారు.
ఆ సినిమాను చూడాలని అంతా అనుకున్నారు. అందుకే హనుమాన్ మౌత్ టాక్ బాగా రావడంతో వెంటనే బుకింగ్స్ ఊపందుకున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి ఇప్పుడు మూడు వందల కోట్ల క్లబ్బులోకి వెళ్లింది. అయితే ఈగల్ మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతోంది.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈగల్ బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికే ఈ రేంజ్‌లో ఈగల్ కష్టపడింది. అంటే లాభాల మాట ఇక దేవుడెరుగు అన్నట్టు అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. ఓవర్సీస్‌లో అయితే మరీ దారుణంగా ఉంది. ఈగల్ చిత్రానికి ఓవర్సీస్‌లో అసలు ఆదరణే లేనట్టుగా అనిపిస్తోంది. ఈగల్ మూవీకి అక్కడ ఇప్పటి వరకు కనీసం హాఫ్ మిలియన్ డాలర్లు కూడా వచ్చినట్టుగా కనిపించడం లేదు.
ఇప్పుడు చిన్న సినిమాలే అక్కడ హాఫ్ మిలియన్, మిలియన్ డాలర్లు కొట్టేస్తున్నాయి. కానీ రవితేజ లాంటి హీరో హాఫ్ మిలియన్ కూడా కొట్టలేకపోయాడు. ఈగల్ సినిమాకు అక్కడ దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే.. టైగర్ నాగేశ్వరరావు బాటలోనే ఈగల్ కూడా నడిచేట్టుంది. ఈగల్‌కు లాభాలు అయితే కనిపించడం లేదు.. మరి ఇలాంటి సినిమాకు సీక్వెల్‌ను మళ్లీ ప్లాన్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.