Salaar actor Prithviraj Sukumaran property:
బాలీవుడ్ వర్గాల్లో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ముంబయి పాలి హిల్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన డూప్లెక్స్ ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. ఆడుజీవితం సినిమా ఇది ముంబయిలో రెండవ ఆస్తి.
తాజా సమాచారం ప్రకారం, పృథ్విరాజ్ సుమారు 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక లగ్జరీ డూప్లెక్స్ ను రూ. 30.60 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. ఈ డూప్లెక్స్‌కు నాలుగు కారు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి అని టాక్.
పృథ్విరాజ్ ఈ ఆస్తిని పృథ్విరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అదనంగా రూ. 1.84 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అలాగే, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పాలి హిల్, బాంద్రా ప్రాంతాల్లో ఉన్న చాలా మంది బాలీవుడ్ స్టార్ లు ఉండే సొసైటీలోకి ఇప్పుడు పృథ్విరాజ్ కూడా చేరారు.
Read More: 35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో
ఇంతకుముందు, పృథ్విరాజ్, ఆయన భార్య సుప్రియ రూ. 17 కోట్లు పెట్టి పాలి హిల్ ప్రాంతంలోనే వేరే ఇల్లు కొన్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే ఈ స్థలం కూడా ఉన్నట్టు సమాచారం.
ఇక సినిమాల పరంగా చూస్తే, సలార్, ఆడుజీవితం చిత్రాలలో పృథ్విరాజ్ వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన విలయత్ బుద్ధ, నోబడీ, ఎల్2: ఎంపురాన్ వంటి ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు.